క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- పులివెందులలో కొడితే ఆ సౌండ్ రాష్ట్రమంతటా వినిపించాలని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. పులివెందుల నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలను ధైర్యంగా ఎదురించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
హయత్‌నగర్‌లో విషాదం.. లారీ ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి
వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో తాను చేపట్టబోయే పాదయాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఆ పాదయాత్ర తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా తుడుచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. రాబోయే రెండేళ్ల తర్వాత వచ్చేది ‘జగన్ 2.0’ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘జగన్ 2.0’లో తాను ఒక అడుగు ముందడుగు వేస్తే, కార్యకర్తలు రెండు అడుగుల పాత్ర పోషిస్తారని జగన్ స్పష్టం చేశారు. కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని, వారందరినీ కాపాడుకునే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.
గౌహతిలో దారుణం.. హోటల్ లీజు వివాదం.. కాల్పుల్లో ఐదుగురు మృతి!
