-
ఇద్దరి మధ్య మాటలు కరువు
-
గులాబీ పార్టీతో కాంగ్రెస్, బిజెపి మైండ్ గేమ్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: గులాబీ పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఇప్పుడు అనేక రకాలుగా చర్చ నడుస్తోంది. ఆ పార్టీ అగ్ర నేతల్లో ఒకరైన హరీష్ రావును కెసిఆర్ దూరం పెట్టారన్న వార్త పొలిటికల్ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. కెసిఆర్ తన ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు హరీష్ రావును రానించడం లేదని.. ఇద్దరి మధ్య మాటలు లేవని.. పార్టీలో ఆయనకు ప్రాధాన్యత క్రమంగా తగ్గించారంటూ కొన్ని వర్గాలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల సమయం వచ్చినా.. కీలక రాజకీయ సంక్షోభాలు ఎదురైనా గులాబీ పార్టీలో హరీష్ పాత్రను వివాదాస్పదం చేస్తూ ఇలాంటి ప్రచారం జరగడం పరిపాటిగా మారింది. అయితే క్షేత్రస్థాయి రాజకీయ వాస్తవాలను నిశితంగా పరిశీలిస్తే.. ఇవన్నీ ప్రత్యర్థి పార్టీలు ఆడుతున్న మైండ్ గేమ్ తప్ప మరొకటి కాదు అని స్పష్టమవుతోంది.
ఆ సాహసం చేస్తారా…
గులాబీ పార్టీ అత్యంత రాజకీయ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీని విభేదించి కవిత దూరంగా వెళ్లిపోయారు. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ పరిస్థితి ఏమంత బాగాలేదు. ఈ సమయంలో హరీష్ రావు ఉన్న దూరం చేసుకోవాలని గులాబీ పార్టీ అగ్రనాయకత్వం ఊహించదు. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని క్షేత్రస్థాయిలో నడిపించడంలో.. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విధానపరంగా నిలదీయడంలో హరీష్ రావు పాత్ర కీలకమైనది. బడ్జెట్ గణాంకాలపై పట్టు, వ్యవసాయ సాగునీటి రంగాల సమస్యలపై మంచి అధ్యయనం, క్యాడర్ను సమన్వయం చేసే మాస్ లీడర్షిప్ ఉన్న నాయకుడు హరీష్ రావు. పైగా ట్రబుల్ షూటర్ అనే పేరు ఉంది. ఆయనను పక్కన పెట్టే సాహసం కెసిఆర్ చేయరు. ఈ కఠిన సమయంలో కేటీఆర్, హరీష్ రావుల సమిష్టిబలం పార్టీకి ప్రాణాధారం. ఇది కచ్చితంగా గులాబీ అగ్రనాయకత్వానికి తెలుసు.
కెసిఆర్ పట్ల విధేయత…
తెలంగాణ ఉద్యమకాలం నుంచి కెసిఆర్ నాయకత్వాన్ని బలంగా సమర్థించి ప్రజల్లోకి హరీష్ రావు. ఈ విషయంలో ఆయన విశ్వసనీయత శంకించేందుకు వీలు కాదు. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు కెసిఆర్ నాయకత్వం తన మార్గదర్శకమని.. గులాబీ జెండా తన ఊపిరిని హరీష్ రావు నిరూపించుకుంటూనే వచ్చారు. ఆయన రాజకీయ శైలి తెలిసినవారు.. కెసిఆర్ ఉన్నంతకాలం ఆయన వ్యతిరేకించే అవకాశం లేదు. గతంలో మంత్రి పదవుల కేటాయింపులు, పార్టీ అంతర్గత సర్దుబాట్ల సమయంలో తన అసంతృప్తిని బాహటంగా వ్యక్తం చేయకుండా అధినేత నిర్ణయాలను కట్టుబడిన చరిత్ర హరీష్ రావుది.
రాజకీయ పన్నాగం…
ఒక పార్టీని బలహీనం చేయాలంటే అగ్రనేతల మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం చేయడం సర్వసాధారణం. ఇప్పుడు హరీష్ రావు విషయంలో ప్రత్యర్థులు చేస్తున్న పని అదే. కాంగ్రెస్ తో పాటు బిజెపి హరీష్ రావు పై అనుమానాలు రేకెత్తించి గులాబీ పార్టీని నైతికంగా బలహీన పరచాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కెసిఆర్ కుటుంబం హరీష్ రావు రాజకీయంగా నిర్వీర్యం చేసుకోందని ప్రచారం లేవనెత్తడం ద్వారా పార్టీలో చీలిక తేవాలని పథకం రచిస్తున్నాయి. కానీ ఈ తరహా కుట్రలు, ఊహాగానాలపై ఎలాంటి తొందరపాటు ప్రకటనలు చేయకుండా హరీష్ రావు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుండడం అభినందనీయం.
ఇవి కూడ చదవండి:
-
గౌహతిలో దారుణం.. హోటల్ లీజు వివాదం.. కాల్పుల్లో ఐదుగురు మృతి!
-
ఏపీ అభివృద్ది ధ్యేయంగా పని చేస్తున్నాం…! డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్
-
రేవంత్ మహారాష్ట్ర బాట…! తుమ్మిడిహెట్టి బ్యారేజీ పట్టాలెక్కేనా…?
-
రిలయన్స్ జియో ప్రభంజనం…!
