Homeతెలంగాణ'బ్యాలెట్'లోనూ హస్తం పరాభవమే...!

‘బ్యాలెట్’లోనూ హస్తం పరాభవమే…!

  • 28 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు జీరో ఫలితం

  • వ్యవస్థలపై నిరసనలతో సరిపెడుతున్న వైనం

  • మేల్కొనకుంటే ఆ పార్టీ గట్టెక్కడం అసాధ్యం

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ ఇటీవల జాతీయస్థాయిలో ఎన్నికల సంఘం నిర్ణయాలపై గట్టి పోరాటం చేస్తోంది. పాత బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని తీవ్ర నిరాశనం మిగిల్చాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన 28 ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్.. ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. చివరకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా ఉన్న కర్ణాటకలో సైతం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయింది. తమ చేతిలో ఉన్న సిట్టింగ్ స్థానాన్ని కూడా ఆ పార్టీ చేతికించుకోకపోవడం నిజంగా మింగుడు పడని పరిణామం. అధికారం చేతిలో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఓటమిని మూట కట్టుకోవడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ప్రజల ఆలోచనకు దగ్గరగా…

సాధారణంగా ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి బ్యాలెట్ పత్రాల ద్వారానే జరుగుతాయి. అయితే ఇవి నేరుగా ప్రజాతీర్పు కాకపోయినా.. ప్రాంతీయ రాజకీయ సమీకరణలు, అధికార పంపిణీ, పార్టీ సంస్థాగత బలాబలాలను అంచనా వేయడానికి స్పష్టమైన దిశా నిర్దేశం చేస్తాయి. ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, పట్టభద్రుల ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికల్లో 28లో ఒక్క సీటు కూడా సాధించుకోలేకపోవడం కాంగ్రెస్ క్షేత్రస్థాయి మేనేజ్మెంట్ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. మిత్రపక్షాలతో సరైన సమన్వయం లేకపోవడం, ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పి కొట్టలేక పోవడమే ఈ ఘోర పరాభవానికి కారణం.

నెట్వర్క్ బలహీనం…

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నెట్వర్క్ ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు. అగ్ర నాయకత్వం కేవలం జాతీయస్థాయిలో ర్యాలీలపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. క్షేత్రస్థాయిలో పార్టీ నెట్వర్క్ తో పాటు కేడర్ను పూర్తిగా గాలికి వదిలేసింది. బూత్ స్థాయి నుంచి స్థానిక సంస్థల వరకు బలమైన యంత్రాంగం లేకపోవడం వల్లనే ఇటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ తేలిపోతోంది. ప్రతిపక్షాల వ్యూహాత్మక ఓటింగ్, ఆకర్షణీయమైన అభ్యర్థుల ఎంపికతో ప్రత్యర్ధులు పై చేయి సాధిస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం అంతర్గత విభేదాలు, అనాలోచితం నిర్ణయాలతో మూల్యం చెల్లించుకుంటోంది.

భ్రమలు తగ్గించుకుంటేనే…

జాతీయస్థాయిలో 28 స్థానాల్లో పోటీ చేస్తే సున్నా ఫలితం రావడం అనేది కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఆందోళనకు గురిచేసే అంశమే. మోడీ సర్కార్ పై వ్యతిరేకత పెరిగిందని.. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ లేనిపోని భ్రమలు పెట్టుకుంటుంది ఆ పార్టీ అగ్ర నాయకత్వం. కానీ క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం బలహీన పడిందన్న విషయాన్ని గుర్తించుకోలేకపోతోంది. ఈ పరాభవం నుంచి వెంటనే పాఠాలు నేర్చుకుని.. సంస్థాగత లోపాలను సరిదిద్దుకోకపోతే కాంగ్రెస్ భవిష్యత్తులో మరింత భారీ వెనుకబాటును ఎదుర్కోక తప్పదు. ఓటు చోరీ అంటూ వ్యవస్థలపై దాడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి.. బ్యాలెట్ పత్రాలతోనే షాకింగ్ విషయం ఎదురయింది. మరి ఆ పార్టీ అగ్రనాయకత్వం ఎంతవరకు గుణపాఠాలు నేర్చుకుంటుందో చూడాలి.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. 27 ఏళ్ల తర్వాత అక్కడ టిడిపి జెండా…!
  2.  కొంపల్లిలో తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
  3.  బియ్యం కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
  4.  ఇండియన్ లీగ్స్‌లో సరికొత్త చరిత్ర

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు