Homeసినిమా'పెద్ది' వివాదంపై స్పందించిన జాన్వీ కపూర్: 'కాఫీ విత్ కరణ్' షోలో ఆవేదన, భావోద్వేగ వ్యాఖ్యలు!

‘పెద్ది’ వివాదంపై స్పందించిన జాన్వీ కపూర్: ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఆవేదన, భావోద్వేగ వ్యాఖ్యలు!

క్రైమ్ మిర్రర్, సినిమా:- బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఇటీవల నటించిన ‘పెద్ది’ చిత్రంలో ఆమె పాత్రపై తీవ్ర వివాదం వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ అంశంపై టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ లో పాల్గొన్న ఆమె తీవ్రంగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.

జాన్వీ కపూర్ వ్యాఖ్యలలోని ముఖ్యాంశాలు:-
“ఒక సినిమా నిర్మాణం వెనుక చాలామంది కష్టం ఉంటుంది. అయితే ఈ చిత్రం చుట్టూ జరిగిన నెగెటివ్ ప్రచారం నన్ను తీవ్రంగా బాధించింది. ఈ చేదు అనుభవం నా జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంటుంది” అని పేర్కొన్నారు. కొన్ని సీన్లు అసభ్యంగా, లైంగిక దాడిని ప్రోత్సహించేలా ఉన్నాయన్న విమర్శలపై స్పందిస్తూ—అలాంటి సన్నివేశాల పట్ల తాను మరింత అప్రమత్తంగా ఉండి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కథా చర్చలు లేదా చిత్రీకరణ సమయంలో కొన్ని విషయాలకు స్పష్టంగా ‘నో’ చెప్పి ఉండాల్సిందని, అయితే ఆ పొరపాటు జరిగిపోయిందని అంగీకరించారు. జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నానని, ఇకపై భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడటం మాత్రమే ప్రస్తుతం తన చేతుల్లో ఉందని వివరించారు.సినిమా వివాదాలపై నటీనటులు బహిరంగంగా మాట్లాడటం అరుదుగా జరిగే విషయమైనందున జాన్వీ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు