Homeతెలంగాణకొంపల్లిలో తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

కొంపల్లిలో తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

– కుటుంబానికి అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
– రూ.10 వేల ఆర్థిక సాయం అందించిన వీరమల్ల సురేష్‌గౌడ్‌

మునుగోడు, క్రైమ్ మిర్రర్:-మునుగోడు మండలంలోని కొంపెల్లి గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కొంపెల్లి గ్రామానికి చెందిన బోయపర్తి మహేందర్‌ (39) వారం రోజుల క్రితం అనారోగ్యానికి గురయి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన మహేందర్‌కు నలుగురు ఆడపిల్లలు సంతానం. కుటుంబాన్ని పోషిస్తూ బిడ్డల భవిష్యత్తుకు అండగా నిలిచిన ఆయన ఆకస్మిక మరణంతో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.బుధవారం నిర్వహించిన అంత్యక్రియల్లో పెద్ద కూతురు సాక్షి తండ్రికి తలకొరివి పెట్టింది. తండ్రిని కోల్పోయిన ఆడబిడ్డలు కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు గ్రామస్తులను కలచివేసింది.

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత…

మహేందర్‌ మృతి విషయం తెలుసుకున్న మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం పంపించారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మందుల సత్యం మహేందర్‌ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు.

ఆర్ధిక సాయం అందజేసిన విరమల్ల సురేష్ గౌడ్

కొంపెల్లి గ్రామానికి చెందిన ఆదిత్య ట్రాన్స్‌పోర్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీరమల్ల సురేష్‌గౌడ్‌ బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు.కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయిన రోజా, ఆమె నలుగురు ఆడబిడ్డలకు భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు దాతలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఆపదలో ఉన్న ఈ కుటుంబానికి సమాజం అండగా నిలిచి చిన్నారుల భవిష్యత్తుకు చేయూత అందించాలని కోరారు.

బియ్యం కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు