దేశ ప్రధాని నరేంద్ర మోదీకి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ఇవ్వాలని భారతీయ జనతా పార్టి రాజ్యసభ ఎంపీ విక్రమ్‌జీత్ సాహ్నీ డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
ఎంపీ విక్రమ్‌జీత్ సాహ్నీ వ్యాఖ్యలలోని ముఖ్య వివరాలు:-
గతంలో దేశ ప్రధానులుగా సేవలు అందించిన జవాహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ వంటి నాయకులకు భారతరత్న పురస్కారాలు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. G20, BRICS వంటి అంతర్జాతీయ కూటముల్లో భారత్‌ను అత్యున్నత స్థాయికి చేర్చడంలో ప్రధాని మోదీ పాత్ర కీలకమైనదని, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను పెంచిన మోదీకి కూడా భారతరత్న ఇవ్వడం సముచితమని అభిప్రాయపడ్డారు. గత 25 సంవత్సరాలుగా మోదీ నిరంతరం ప్రజాసేవలో మునిగితేలుతున్నారని, అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకోవడానికి ఆయనకు పూర్తి అర్హత ఉందని స్పష్టం చేశారు.
పంజాబ్‌కు చెందిన ఎంపీ విక్రమ్‌జీత్ సాహ్నీ, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తరఫున ప్రాతినిధ్యం వహించారు. అనంతరం రాఘవ్ చడ్డా సహా ఆప్‌ను వీడి బీజేపీలో చేరిన ఏడుగురు ఎంపీలలో సాహ్నీ ఒకరు.నరేంద్ర మోదీ దేశాభివృద్ధికి, అంతర్జాతీయ దౌత్య సంబంధాలకు చేసిన కృషికి గాను ఈ పురస్కారాన్ని అందించాలని ఆయన నొక్కి చెప్పారు.
‘మిల్కీ బ్యూటీ’ వ్యాఖ్యలపై తమన్నా ధీటైన స్పందన: నెగెటివిటీని పట్టించుకోనంటూ స్పష్టత!
