కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల మండల మకరవిళక్కు యాత్రకు సంబంధించి వర్చువల్ టికెట్ బుకింగ్స్ రేపు ఉదయం 10:00 గంటలకు ప్రారంభం కానున్నాయి. పంబా నది నుంచి ఆలయానికి వెళ్లే భక్తులకు వర్చువల్ క్యూ పాస్ పొందడం తప్పనిసరి అని దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. భక్తులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు.
మంచి పాత్రలొస్తే తప్పకుండా నటిస్తా’.. రూట్ మార్చిన పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి!
దేవస్థానం నిబంధనల ప్రకారం, నిలక్కల్-పంబా రూట్‌లో రోజుకు 60 వేల మందికి, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో 3 వేల మందికి దర్శన అవకాశం కల్పిస్తారు. ఆన్‌లైన్ ద్వారా ముందుస్తు బుకింగ్ చేసుకోలేని భక్తుల సౌకర్యార్థం కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో స్పాట్ బుకింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.
బెంగళూరులో డీఆర్‌డీఓ శాస్త్రవేత్త మృతి.. ఘటనపై పోలీసుల దర్యాప్తు
