ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారానికి సంబంధించిన వివాదం ఓ యువతి ప్రాణాలను బలిగొన్నట్లు సమాచారం. హటా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. ఓ గదిలో యువతి, ఆమె ప్రియుడి మధ్య ఏదో విషయంపై వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన యువకుడు యువతిపై దాడి చేసి, ఆమె గొంతు కోసినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో యువతి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, అతడిని గమనించిన గ్రామస్థులు పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించే ముందు స్థానికులు అతడిపై దాడి చేసినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. యువతి హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు అధికారిక దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
also read: రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ఇన్స్పెక్టర్
