Homeక్రైమ్పంజాబ్‌లో పట్టపగలే కాల్పులు.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

పంజాబ్‌లో పట్టపగలే కాల్పులు.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

క్రైమ్ మిర్రర్ : పంజాబ్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. కారులో ప్రయాణిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడటంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తార్న్ తరణ్ జిల్లాలోని అసల్ ఉత్తర్ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

ఈ కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తిని గురుసేవక్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. గాయపడిన హర్‌కిరత్ సింగ్, సాజన్ సింగ్‌లను భికీవింద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, థార్ ఎస్‌యూవీలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు వాహనం నుంచి దిగి, మరో కారులో ఉన్న వారిపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో కారులో ఉన్నవారు తీవ్రంగా గాయపడగా, ఒకరు అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

ఈ కేసులో ఒక నిందితుడిని మంజీత్ సింగ్ అలియాస్ కట్టాగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అతడిపై గతంలోనే పలు క్రిమినల్ కేసులు నమోదైనట్లు సమాచారం. మరో నిందితుడి గుర్తింపు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

పట్టపగలు జనసంచారం ఉన్న ప్రాంతంలో కాల్పులు జరగడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. దాడికి గల కారణాలు ఏమిటి? వ్యక్తిగత కక్షలే ఈ ఘటనకు దారితీశాయా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు వార్తల్లో నిలుస్తున్న నేపథ్యంలో పంజాబ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
also read : మునుగోడు లక్కీ భాస్కర్…! అచ్చం సినిమా మాదిరిగానే తెర‌వెనుక గోల్‌మాల్‌..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు