-
సీనియర్ ఐపీఎస్ అధికారి స్వచ్ఛంద పదవీ విరమణ
-
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు రాలేదనే బాధతోనే…?
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ విఆర్ఎస్ తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు రాలేదన్న బాధతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. తెలంగాణలో అధికార యంత్రాంగంలో అత్యంత కీలకమైన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల రూపురేఖలను శాసించారు ఈ సీనియర్ అధికారి. ప్రస్తుతం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కానీ ఉన్నట్టుండి ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ బాట పట్టారన్న వార్త కలకలం రేపుతోంది. వాస్తవానికి ఆయన సర్వీసు 2027 సెప్టెంబర్ వరకు ఉంది. కానీ 11 నెలల ముందే విధులకు వీడ్కోలు కలకాలని నిర్ణయించుకోవడం పాలనా వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఐఏఎస్ వర్గాల్లో దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
అప్పటి మాదిరిగా ఇప్పుడు కూడా…
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిని ఆశించారు. కానీ చివరి నిమిషంలో సమీకరణలు మారాయి. ఇప్పుడు రేవంత్ సర్కారులు సీనియారిటీకి తగిన గుర్తింపు దక్కలేదన్న అసంతృప్తితోనే ఆయన కేంద్ర డివోపిటికీ స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు పంపారు అనే ప్రచారం తెరపైకి వచ్చింది. జయష్ రంజన్ కేవలం ఒక సాధారణ బ్యూరోక్రాట్ మాత్రమే కాదు. తెలంగాణ ఆవిర్భావం నుంచి హైదరాబాదును గ్లోబల్ ఐటీ హబ్ గా.. స్టార్టాప్ రాజధానిగా నెలపడంలో తిరుగులేని పాత్ర పోషించారు. మోడరన్ ఫేస్, టీ హబ్, వీ హబ్, ఇమేజ్ టవర్స్ రూపకల్పన చేసింది కూడా ఆయనే. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదికపై వేలకోట్ల విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించడంలో ఆయన చూపిన చొరవ కూడా గొప్పది.
ప్రపంచ స్థాయి నెట్వర్క్…
ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఆపిల్ వంటి బహుళ జాతి కంపెనీల సీఈవోలు, టాప్ ఎగ్జిక్యూటివ్ లతో ఆయనకు ఉన్న అంతర్జాతీయ నెట్వర్క్, బ్యాంక్ ఆఫ్ కాంటాక్ట్స్ దేశంలో ఏ ఇతర అధికారి లేనంత బలం ఆయన ప్రత్యేకత. ప్రభుత్వ సర్వీసులకు గుడ్ బై చెప్పిన తర్వాత ఆయన ఏం చేయబోతున్నారన్న అంశంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో మరో సీనియర్ అధికారి సయ్యద్ అలీ మార్తజా రిజ్వి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఓ ప్రైవేటు ఆసుపత్రి గ్రూపు బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు రంజన్ కూడా ఓ అంతర్జాతీయ కార్పొరేట్ దిగ్గజ సంస్థలో చరణ్ ఉన్నట్లు సమాచారం. గ్లోబల్ టెక్ లేదా కన్సల్టెన్సీ సంస్థలకు ఇండియా కార్యకలాపాల హెడ్ గా కానీ.. అమెరికాకు చెందిన బహుళ జాతి వెంచర్ క్యాపిటల్ ఫండ్ బోర్డులో కీలక సలహాదారుడిగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన ఎంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు రాలేదన్న బాధ ఉన్నట్లు సమాచారం. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.
ఇవి కూడ చదవండి:
-
రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ఇన్స్పెక్టర్
-
ఆర్నబ్ తుఫాన్ ప్రభావం.. కాకినాడ జిల్లాలో ముగ్గురు మత్స్యకారులు గల్లంతు
-
పంజాబ్లో పట్టపగలే కాల్పులు.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
-
మునుగోడు లక్కీ భాస్కర్…! అచ్చం సినిమా మాదిరిగానే తెరవెనుక గోల్మాల్..
