Homeఆంధ్ర ప్రదేశ్బెజవాడలో వార్ వన్ సైడ్..! ప్రచారంలోనూ కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ...

బెజవాడలో వార్ వన్ సైడ్..! ప్రచారంలోనూ కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ…

  • వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మి కి నేతల సహాయ నిరాకరణ

  • అంతగా ప్రభావం చూపలేకపోతున్న ఏబీ వెంకటేశ్వరరావు

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పోటీ ఉంది. అధికార కూటమికి గట్టి పోటీ ఇస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు చేసింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కడికక్కడే వైసీపీలో ఒక రకమైన గందరగోళం కనిపిస్తోంది. ప్రచార వైఫల్యం కూడా వెలుగు చూస్తోంది. అధికార కూటమి మాత్రం దూకుడుగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా విజయవాడ మహానగరంలో అధికార కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన వంగవీటి రాధాకృష్ణ అన్ని అంశాల్లో ముందంజలో ఉన్నారు.

ఏకతాటి పైకి కూటమి…

రాష్ట్ర రాజకీయాలకు గుండెకాయ వంటిది విజయవాడ. అక్కడ టిడిపి కూటమి నుంచి జనసేన అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ బరిలో ఉన్నారు. అనూహ్యమైన ప్రజా మద్దతుతో అత్యంత పటిష్టమైన స్థితిలో దూసుకుపోతున్నారు. విజయవాడ ప్రజానీకంలో వంగవీటి కుటుంబానికి ఉన్న భావోద్వేగ అనుబంధం, దివంగత రంగా అభిమానుల అండదండలతో పాటు కూటమి పార్టీల ఓటు బ్యాంకు ఏకతాటిపైకి రావడం కలిసి వచ్చే అంశం. విజయవాడ కూటమి ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, బోండా ఉమామహేశ్వరరావు, సుజనా చౌదరి తో పాటు జనసేన నేతలు సమన్వయంతో సాగిస్తున్న ప్రచారం వంగవీటి రాధాకృష్ణకు అదనపు బలం.

వైసిపిలో వెనుకబాటు…

కూటమితో పోలిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో బాగా వెనుకబడిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మరక్షణలో పడిపోయింది. రాధాకృష్ణ వంటి మాస్ లీడర్ ను ఢీకొట్టేందుకు బలమైన సామాజిక, రాజకీయ నేపథ్యం ఉన్న అభ్యర్థిని రంగంలోకి దించడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఓటమి ఖాయమని ముందే గ్రహించిన నగరానికి చెందిన ముఖ్య నేతలు, మాజీ మంత్రులు పోటీకి పూర్తిగా ముఖం చాటేసారు. దీంతో అనివార్య పరిస్థితుల్లో మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కి మళ్ళీ టికెట్ కేటాయించాల్సి వచ్చింది. కానీ ఆమె ప్రచార పర్వంలోనూ,, ఇతరత్రా అంశాల్లోనూ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నెలకొన్న అంతర్గత అసంతృప్తి, ముఖ్య నేతల సహాయ నిరాకరణ మేయర్ అభ్యర్థి భాగ్యలక్ష్మి అవకాశాలను పూర్తిగా సమాధి చేస్తున్నాయి. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు వంటి కీలక నేతలు ఎవరికి వారే నామమాత్రంగా దర్శనమిచ్చి వెళ్ళిపోతున్నారు. దీంతో క్యాడర్ తీవ్ర గందరగోళానికి గురవుతోంది. పార్టీ నుంచి ఫండింగ్ లేక కార్పొరేట్ అభ్యర్థులు కూడా చేతులెత్తేస్తున్నారు.

సదస్సులకే పరిమితం…

మరోవైపు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. విజయవాడ ను నిజాయితీగా, అవినీతి రహితంగా తీర్చిదిద్దుతానంటూ ఆయన ప్రచారం మొదలుపెట్టారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. కేవలం సదస్సులు, యూట్యూబ్ ఇంటర్వ్యూల కే పరిమితం అవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వంగవీటి రాధాకృష్ణకు స్పష్టమైన ఏజ్ కనిపిస్తోంది. ప్రచారంతోపాటు ప్రజాదారణలోనూ ప్రత్యర్థుల కంటే కొన్ని మైళ్ళ ముందు వరుసలో ఉన్నారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. ప్రధాని నరేంద్ర మోదీకి ‘భారతరత్న’ ప్రదానం చేయాలి.. ఎంపీ విక్రమ్‌జీత్ డిమాండ్!
  2.  ‘మిల్కీ బ్యూటీ’ వ్యాఖ్యలపై తమన్నా ధీటైన స్పందన: నెగెటివిటీని పట్టించుకోనంటూ స్పష్టత!
  3. గ్రామీణ ఉపాధి హామీ నిధుల వినియోగంలో దేశంలోనే ఏపీ ఫస్ట్.. నాలుగో స్థానంలో తెలంగాణ!
  4. యూపీలో దారుణం.. ప్రేమ వివాదంలో యువతి హత్య!

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు