Homeతెలంగాణతెలంగాణ‌లో బీజేపీ సంచ‌ల‌నం...! హైద‌రాబాద్‌లో అమిత్‌షా మ‌హా పాద‌యాత్ర‌....

తెలంగాణ‌లో బీజేపీ సంచ‌ల‌నం…! హైద‌రాబాద్‌లో అమిత్‌షా మ‌హా పాద‌యాత్ర‌….

  • నవంబరు రెండున ట్యాంక్ బండ్ పై

  • హాజరుకానున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా

  • కాంగ్రెస్ ఓటు చోరీ నినాదానికి ధీటుగా…

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: హైదరాబాదులో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాదయాత్ర చేయనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టేందుకు.. బిజెపి భారీ వ్యూహంతో ముందుకు వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకాన్ని అడ్డుకోండి అని శక్తివంతమైన నినాదంతో నవంబర్ 2న ట్యాంక్ బండ్ వేదికగా బిజెపి మహాపాదయాత్రను చేపట్టనుంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్వయంగా ఈ పాదయాత్రలో పాల్గొని.. తెలంగాణ రణక్షేత్రంలో బిజెపి శ్రేణులకు దిశ నిర్దేశం చేయనున్నారు.

రాజకీయ సంచలనమే…

బిజెపి భారీ కార్యక్రమాన్ని రూపొందించడంతో తెలంగాణలో సంచలనంగా మారింది. కాంగ్రెస్ ఓటు చోరీ డ్రామాకు అమిత్ షా కౌంటర్ ఇచ్చేందుకు ఈ మహా పాదయాత్ర చేపట్టారు. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ ఆరోపణలతో భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. సరిగ్గా ఆ మరుసటి రోజే హైదరాబాద్ వేదికగా అమిత్ షా ఈ పాదయాత్రలో పాల్గొనడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టడమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం. మరణించిన వారు, చిరునామాలు మారిన వారి వివరాల సవరణను కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని.. ప్రజల్లోకి నేరుగా వెళ్లి నిజాలను వివరించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.

ద్విముఖ వ్యూహంతో…

రెండు రకాల రాజకీయ ప్రయోజనాల కోసం బిజెపి ఈ మహా పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలన్న ఆకాంక్షతో ఉంది బిజెపి. పార్టీ శ్రేణులను దిశ నిర్దేశం చేయడంతో పాటు.. రాష్ట్రంలో రోజురోజుకు దిగజారుతున్న రేవంత్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను నిలదీసేలా బిజెపి ఈ కార్యక్రమాన్ని రూపు కల్పన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 300కు పైగా మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితి నెలకొంది. భాగ్యనగరంలో తాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడంలో రేవంత్ సర్కార్ విఫలం అయింది.. దీనిని ప్రధానంగా ఎండగట్టేందుకు బిజెపి ఈ మహా పాదయాత్రను వినియోగించుకోనుంది. తెలంగాణలో ప్రజా సమస్యలను వదిలేసి కాంగ్రెస్ ఢిల్లీ బాట పడుతోందని.. అందుకే తాము తెలంగాణ వచ్చి పోరాట బాట పడుతున్నట్లు బిజెపి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయనుంది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  ‘ఓం’లో సాయి పల్లవి పవర్‌ఫుల్ రోల్.. “నిత్య రెడ్డిలో నా మరో రూపాన్ని చూస్తున్నా”!
  2. భారత పారా అథ్లెటిక్స్‌లో విషాదం.. మూడు ఆసియా స్వర్ణాలు గెలిచిన నీరజ్ యాదవ్ మృతి!
  3. ఏపీలో అర్నబ్ తుపాను బీభత్సం.. కేంద్ర బృందాలను పంపాలని అమిత్ షాకు చంద్రబాబు లేఖ!
  4.  సైబ‌ర్ నేరం సాదార‌ణ నేరం కాదు…! నేర‌గాళ్ల‌ను నిర్దాక్షిణ్యంగా శిక్షించాల్సిందే…! సుప్రీం కోర్టు…

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు