Homeక్రైమ్తల్లిని హత్య చేసిన కూతురు.. ప్రియుడితో కలిసి దారుణానికి ప్లాన్

తల్లిని హత్య చేసిన కూతురు.. ప్రియుడితో కలిసి దారుణానికి ప్లాన్

గుంటూరు జిల్లా పొన్నూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. క్యాబిన్ పేటకు చెందిన ఈవూరు లక్ష్మి (48) అనే మహిళ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆమె కుమార్తె పుష్పలత, ఆమె ప్రియుడు రాజా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. విచారణలో హత్యకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

లక్ష్మి కుమార్తె పుష్పలత భర్త మృతి చెందడంతో తన కుమారుడితో కలిసి కొంతకాలంగా తల్లి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు రాజా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధంగా మారినట్లు తెలుస్తోంది.

అయితే పుష్పలతతో రాజా సంబంధాన్ని ఆమె తల్లి లక్ష్మి తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. రాజాకు దూరంగా ఉండాలని కుమార్తెకు పలుమార్లు నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. దీంతో తల్లి తమ సంబంధానికి అడ్డుగా మారిందని భావించిన పుష్పలత.. ప్రియుడు రాజాతో కలిసి ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.

ప్లాన్‌లో భాగంగా లక్ష్మి ముఖంపై దిండు ఉంచి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

also read: పిడుగుల గర్జనకు ఇద్దరు వృద్ధ మహిళలు మృతి.. పల్నాడులో విషాదం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు