Homeక్రైమ్సూర్యాపేటలో విషాదం.. కాలువలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

సూర్యాపేటలో విషాదం.. కాలువలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

సూర్యాపేట జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మునగాల మండలం ముకుందాపురం వద్ద ముక్త్యాల బ్రాంచ్ కెనాల్‌లో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.

అనుదీప్, హరీశ్‌నాయుడు, స్వరూప్ అనే ముగ్గురు విద్యార్థులు కాలువలో ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ముగ్గురూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అనుదీప్‌ను రక్షించారు.

అయితే హరీశ్‌నాయుడు, స్వరూప్‌ను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇద్దరూ నీటిలో మునిగి మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. విద్యార్థుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

also read: AP: మద్యం షాపులకు కొత్త నిబంధనలు.. పాటించకపోతే రూ.10 లక్షల వరకు జరిమానా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు