Homeక్రైమ్రేవారిలో దారుణ హత్య.. భార్యతో సంబంధం ఉందన్న అనుమానంతో స్నేహితుడి ఘాతుకం

రేవారిలో దారుణ హత్య.. భార్యతో సంబంధం ఉందన్న అనుమానంతో స్నేహితుడి ఘాతుకం

హర్యానాలోని రేవారి జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తన భార్యతో మృతుడికి వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో అతడి స్నేహితుడే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

రేవారికి చెందిన జితేంద్ర (40)ను సెప్టెంబర్ 7న బీర్ పార్టీకి వెళ్దామంటూ అతడి స్నేహితుడు ప్రవీణ్ బయటకు తీసుకెళ్లాడు. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తన మేనల్లుడు అమన్‌తో కలిసి జితేంద్రపై దాడి చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఇనుప రాడ్‌తో జితేంద్ర తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రవీణ్, అమన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

హత్యకు ఉపయోగించిన వాహనం, ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలను రాబట్టేందుకు నిందితులను విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

also read: సూర్యాపేటలో విషాదం.. కాలువలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు