Homeతెలంగాణతెలంగాణలో కృత్రిమ పన్నీర్‌పై ఏడాది నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణలో కృత్రిమ పన్నీర్‌పై ఏడాది నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా డైరీయేతర పదార్థాలతో తయారు చేసే కృత్రిమ పన్నీర్‌పై నిషేధం విధించింది. ఈ నిషేధం ఏడాది పాటు అమల్లో ఉండనుంది. నాణ్యత లేని, కల్తీ పన్నీర్ వినియోగం వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

పన్నీర్ పేరుతో విక్రయించే కృత్రిమ, డైరీయేతర ఉత్పత్తుల తయారీతో పాటు వాటి ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, రవాణా, పంపిణీ, విక్రయాలపైనా నిషేధం వర్తించనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆహార భద్రతా విభాగం ‘టీజీ సేఫ్’ ఉత్తర్వులు జారీ చేసింది.

2026 సెప్టెంబర్ 10 నుంచి ఈ ఆదేశాలు రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే అమల్లోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006లోని సెక్షన్ 30(2)(a) ప్రకారం ప్రజారోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ తాజా ఆదేశాలతో పన్నీర్ పేరుతో కృత్రిమ ఉత్పత్తులను తయారు చేసి విక్రయించే కార్యకలాపాలకు అడ్డుకట్ట పడనుంది. ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందేలా ఆహార భద్రతా విభాగం పర్యవేక్షణ మరింత కీలకం కానుంది.

also read: విదేశీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. రూ.179.9 కోట్ల స్కాలర్‌షిప్ నిధులు విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు