హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీనగర్ కాలనీలో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించి, మృతదేహాన్ని తదుపరి ప్రక్రియ కోసం తరలించారు.
మృతురాలిని ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన హేమగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆమె బంజారాహిల్స్‌లోని ఓ కార్ల షోరూమ్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: ‘రెట్రో ఫొటో ట్రెండ్’పై సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక.. వ్యక్తిగత ఫొటోలు షేర్ చేయొద్దని సూచన
