Homeక్రైమ్ప్రజ్వల్ రేవణ్న ఫోన్‌లో 140కి పైగా పోర్న్ వీడియోలు.. ఫోరెన్సిక్ రిపోర్టులో సంచలన విషయాలు

ప్రజ్వల్ రేవణ్న ఫోన్‌లో 140కి పైగా పోర్న్ వీడియోలు.. ఫోరెన్సిక్ రిపోర్టులో సంచలన విషయాలు

కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్నకు సంబంధించిన ఫోన్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఆయనకు సంబంధించిన ఫోన్, పెన్‌డ్రైవ్‌లో 140కి పైగా పోర్న్ వీడియోలు, ఓటీటీ కంటెంట్ ఉన్నట్లు తేలినట్లు తెలుస్తోంది.

కొద్ది నెలల క్రితం జైలు అధికారులు ప్రజ్వల్ రేవణ్న వద్ద ఫోన్‌ను గుర్తించినట్లు సమాచారం. అయితే ఆ ఫోన్ తనది కాదని, ఇతర ఖైదీలు ఉపయోగిస్తున్నారని ఆయన అప్పట్లో చెప్పినట్లు తెలుస్తోంది. తాజాగా ఫోరెన్సిక్ విచారణలో ఫోన్, పెన్‌డ్రైవ్‌కు సంబంధించిన డిజిటల్ డేటాపై కీలక వివరాలు బయటపడినట్లు సమాచారం.

యువతిపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన ప్రజ్వల్ రేవణ్నకు కోర్టు జీవితఖైదు విధించింది. ప్రస్తుతం ఆయన పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. జైల్లో నిషేధిత వస్తువుగా భావించే మొబైల్ ఫోన్ ఆయన వద్దకు ఎలా చేరింది? అందులోని డేటాకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

also read: చేపల చెరువు యజమాని హత్య.. కాకినాడ జిల్లాలో దారుణం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు