Homeక్రైమ్సైడ్ మిర్రర్‌కు బైక్ తగిలిందన్న కోపంతో యాక్సిడెంట్ చేశాడు

సైడ్ మిర్రర్‌కు బైక్ తగిలిందన్న కోపంతో యాక్సిడెంట్ చేశాడు

నగరంలోని మాదాపూర్‌లో క్షణిక కోపం తీవ్ర ప్రమాదానికి కారణమైంది. కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తగిలిందన్న కారణంతో ఓ వ్యక్తి దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారుతో వెంబడించి ఢీకొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ నెల 7న బోరబండకు చెందిన భూమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తన భార్య వసుంధరను కార్యాలయంలో దించేందుకు బైక్‌పై బయలుదేరారు. అయ్యప్ప సొసైటీ సమీపంలో వారి బైక్ ఓ కారుకు తగలడంతో డ్రైవర్ ఫణింద్రకుమార్ శర్మ ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.

దీంతో దంపతులు వెళ్తున్న బైక్‌ను కారు ద్వారా కొంత దూరం వెంబడించిన అనంతరం ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. కారు ఢీకొట్టడంతో బైక్ అదుపుతప్పి మరో కారును ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌రెడ్డి, వసుంధర తీవ్రంగా గాయపడ్డారు.

ఘటనపై రాజశేఖర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫణింద్రకుమార్ శర్మపై కేసు నమోదు చేశారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తగిలిన చిన్న వివాదం చివరకు తీవ్ర ప్రమాదానికి దారితీయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

also read: హోటల్ గదిలో ఎయిర్ ఇండియా కెప్టెన్ మృతి.. మిస్టరీగా మారిన ఘటన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు