Homeక్రైమ్ఆదిలాబాద్‌లో భారీ రియల్ ఎస్టేట్ మోసం.. 16 మంది నుంచి రూ.13.50 కోట్లు వసూలు

ఆదిలాబాద్‌లో భారీ రియల్ ఎస్టేట్ మోసం.. 16 మంది నుంచి రూ.13.50 కోట్లు వసూలు

ఆదిలాబాద్‌లో రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి పలువురు వ్యక్తుల నుంచి ఏకంగా రూ.13.50 కోట్లు వసూలు చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ వ్యవహారంలో బండారి రాకేశ్, కుంటవార్ అచ్యుత్‌రెడ్డిలు నిందితులుగా ఉన్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని చెప్పి పలువురిని ఆకర్షించారు. ఈ క్రమంలో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి వారి వద్ద రూ.1.70 కోట్లు పెట్టుబడిగా ఇచ్చారు. అయితే డబ్బులు తిరిగి ఇవ్వకుండా నిందితులు కాలయాపన చేయడంతో అనుమానం వచ్చిన ప్రవీణ్ కుమార్ పోలీసులను ఆశ్రయించారు.

ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులు ఒక్క ప్రవీణ్ కుమార్‌ నుంచే కాకుండా మొత్తం 16 మంది నుంచి రూ.13.50 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. అనంతరం ఇద్దరినీ అరెస్ట్ చేసి, వారి వద్ద ఉన్న కార్లు, ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

also read:  గర్భం దాల్చిన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని.. ముగ్గురు సిబ్బంది సస్పెండ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు