Homeఆంధ్ర ప్రదేశ్శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. 25 ఎలక్ట్రిక్ బస్సులు విరాళంగా ఇచ్చిన అనంత్ అంబానీ

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. 25 ఎలక్ట్రిక్ బస్సులు విరాళంగా ఇచ్చిన అనంత్ అంబానీ

తిరుమల తిరుపతి దేవస్థానాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ భారీ విరాళాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. టీటీడీకి మొత్తం 25 ఎలక్ట్రిక్ బస్సులను అందించనున్నట్లు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 15 ఎలక్ట్రిక్ బస్సులు ఆదివారం ఉదయం తిరుమలకు చేరుకున్నాయి.

ఈ ఏడాది జూన్‌లో అనంత్ అంబానీ తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను రిలయన్స్ సంస్థ తరఫున అందించనున్నట్లు ప్రకటించారు. బస్సులతో పాటు వాటి నిర్వహణ కోసం అవసరమైన 50 మంది డ్రైవర్లను, ఛార్జింగ్ స్టేషన్‌ను కూడా సమకూర్చనున్నట్లు తెలిపారు.

తిరుమలలో భక్తుల రవాణా సదుపాయాలను మరింత మెరుగుపరచడంతో పాటు పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించేలా ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఉపయోగపడనున్నాయి. మిగిలిన బస్సులు కూడా దశలవారీగా టీటీడీకి అందుబాటులోకి రానున్నాయి.

also read: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన యువకుడికి నరకం చూపించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు