క్రైమ్ మిర్రర్ : ప్రేమించిన వ్యక్తి తనకు దక్కకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పోలవరం జిల్లా దేవీపట్నం మండలం దామనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందింది.
కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. అయితే అదే యువకుడిని మరో యువతి కూడా ప్రేమించడంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో ప్రేమించిన యువకుడు తనకు దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఈ అఘాయిత్యానికి పాల్పడింది.
యువతి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే తీవ్రంగా కాలిపోవడంతో ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న దేవీపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
also read : ప్రియుడితో అక్రమ బంధం.. భర్తను అంతమొందించిన భార్య
