Homeఅంతర్జాతీయంపశ్చిమాసియాలో మళ్లీ మంటలు.. కువైట్‌లో చైనా కంపెనీపై క్షిపణి దాడి!

పశ్చిమాసియాలో మళ్లీ మంటలు.. కువైట్‌లో చైనా కంపెనీపై క్షిపణి దాడి!

క్రైమ్ మిర్రర్ : పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. తాజాగా ఉత్తర కువైట్‌లోని ఒక చైనా సంస్థపై క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో భవనం తీవ్రంగా దెబ్బతినగా, ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిని కువైట్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అమెరికా ఇటీవల ఇరాన్‌పై చేపట్టిన సైనిక చర్యలు ముగిశాయని ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. జోర్డాన్‌లోని అమెరికా స్థావరంపై జరిగిన దాడికి ప్రతిస్పందనగా ఇరాన్‌కు చెందిన కీలక సైనిక లక్ష్యాలపై చర్యలు తీసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (IRGC)కు చెందిన కమాండ్ కేంద్రాలు, తీర భద్రతా వ్యవస్థలు, ఇతర రక్షణ స్థావరాలపై పలుమార్లు దాడులు నిర్వహించినట్లు అమెరికా తెలిపింది. జోర్డాన్‌లోని తమ సైనిక స్థావరంపై జరిగిన దాడులకు తగిన సమాధానం ఇస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఇరాక్‌లో ఇరాన్ అనుబంధ మిలిటెంట్ గ్రూపులపై అమెరికా చేపట్టిన మరో సైనిక చర్యలో పలువురు మిలిటెంట్లు, ఇరాన్‌కు చెందిన సలహాదారులు మరణించినట్లు సమాచారం వచ్చింది.

ఇక ఈజిప్ట్‌లోని డామియెట్టా పోర్టుపై జరిగిన డ్రోన్ దాడిలో రెండు సహజవాయువు రవాణా నౌకల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా, దాడికి బాధ్యులు ఎవరో ఇప్పటికీ స్పష్టత రాలేదు. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు ఈజిప్ట్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ, తాజా పరిణామాలు ప్రాంతీయ భద్రతపై కొత్త ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ దాడుల వెనుక ఇరాన్ పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయితే గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
also read : వరద ముప్పు..ప్రజలకు పోలీసుల హెచ్చరిక..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు