Homeక్రైమ్కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు..!

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సీబీఐ (CBI) దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై తక్షణమే విచారణ జరిపించేలా సీబీఐకి లేఖ రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలో ఢిల్లీకి వెళ్లి సీబీఐ డైరెక్టర్‌ను కలవనున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాల నేపథ్యంలో, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఘోష్ కమిషన్‌ను హైకోర్టు తప్పు పట్టలేదని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు.

విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికలు, నిధుల మళ్లింపు ఆరోపణలను ప్రాతిపదికగా తీసుకుని సీబీఐ విచారణ కోరాలని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు ₹1.45 లక్షల కోట్లకు పైగా నిధుల దుర్వినియోగం, ప్రణాళికా లోపాలు, మరియు నిర్మాణ లోపాలపై విచారణ జరగాలని ప్రభుత్వం కోరుతోం

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు