హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: బంగారు కొనుగోలు దారులకు గుడ్ న్యూస్, డాలర్ బలపడడం లాంటి కారణాలతో మంగళవారం బంగారం ధరలు కాస్తా తగ్గుదల కనిపించింది. అంతర్జాతీయ ఉద్రిక్తలతో హెచ్చుతగ్గులకు లోనవుతుంది. మంగళవారం ఉదయం పది గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.710 మేర తగ్గుదల నమోదు చేసింది.
మంగళవారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,53,000గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,40,250గా ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.650 మేర తగ్గింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,53,150గా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,40,400గా ఉంది.(Live Gold Rates).
మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుదలను నమోదు చేశాయి . కిలోకు 4 వేల రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2.65 లక్షలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.6 లక్షలుగా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.2.65 లక్షలుగా, బెంగళూరులో రూ.2.60 లక్షలుగా ఉంది.