క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : ఏపీలో ప్రస్తుతం సవాళ్ల పర్వం నడుస్తోంది. డీఎస్సీపై చర్చకు రావాలని వైఎస్ జగన్ కు నారా లోకేష్ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ మహిళా నేతలు నారా లోకేష్‌కు సవాల్ విసిరారు. నారా లోకేష్‌తో చర్చకు తమ నాయకుడు అవసరం లేదని.. తాముచాలంటూ లక్ష్మీపార్వతి , శ్యామలతో పాటుగా వైసీపీ మహిళా నేతలు తాడేపల్లి భరతమాత విగ్రహం వద్ద నుంచి సవాల్ విసిరారు. డీఎస్సీలో అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతామని.. దమ్ముంటే చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. “అరేయ్ బాబూ లోకేష్. నీ మాటలు వింటే నవ్వొస్తోందిరా. ఇక్కడికి వచ్చి జగన్ మీద సవాల్ విసిరి వెళ్లిపోయావ్. మహిళలను జగన్ అవమానించారా.. భారతి, వారి పిల్లలు సమాధానం చెప్పాలా? మహిళల మీద మీరు చేస్తున్న ట్రోలింగ్‌కు మేమంతా బాధితులమే. మా మీద, భారతి మీద చేసిన ట్రోలింగ్ గురించి ముందు మాట్లాడు.. తండ్రిని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నావ్. మీ హోం మంత్రిని ఏదో అన్నారని అంటున్నావ్. మీ హోం మంత్రి ఏ ఒక్క కేసు అయినా పట్టించుకుంటున్నారా.. ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి.
హోం మంత్రి ఏనాడైనా పట్టించుకున్నారా? దోషులను శిక్షించారా? మీరు జగన్‌కు నీతులు చెప్తున్నారా..” అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. “డీఎస్సీ గురించి చర్చకు సిద్ధమని సవాల్ చేశావ్. మా నాయకుడు అవసరం లేదు.. మహిళలం మేము వచ్చాం.. ఇప్పుడు రా.. మేము సమాధానం చెప్తాం. ఎంట్రన్స్ లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగమిస్తారా? అవుట్ సోర్సింగ్‌లోని వారికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందా.. ఒక్కో డీఎస్సీ ఉద్యోగానికి రూ. 15 లక్షలు తీసుకున్నారు. నీ అన్యాయాల గురించి జగన్ మాట్లాడితే, వివరాలతో బయటపెడితే.. సమాధానం చెప్పకుండా తండ్రీకొడుకులు పారిపోయారు. సమాధానం చెప్పకుండా దాటేసి పారిపోయిన మీరు ఛాలెంజ్ చేస్తారా..” “నీకు ధైర్యం ఉంటే మీ ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉన్నాం. ఇప్పుడు రమ్మన్నా రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరి పాలనలో మహిళలకు న్యాయం జరిగిందో, అన్యాయం జరిగిందో చర్చకు సిద్ధం. డీఎస్సీలో ఎంత అవినీతి జరిగిందో సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తాం. ఎన్టీఆర్ మనవడినని చెప్పుకుంటావ్ గా.. దమ్ముంటే చర్చకు రా..” అని నారా లోకేష్‌కు లక్ష్మీపార్వతి సవాల్ విసిరారు.