క్రైమ్ మిర్రర్, సినిమా:- కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఆయన లంకేశ్వరుడి (రావణుడు) పాత్రలో కనిపిస్తూనే, మరోవైపు సహ నిర్మాతగా (కో-ప్రొడ్యూసర్) కూడా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా బిజినెస్ డీల్‌కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త ఫిలిం నగర్ వర్గాల్లో వైరల్ అవుతోంది.ఈ చిత్రంలో తన పాత్రకు గానూ రెగ్యులర్ రెమ్యూనరేషన్ తీసుకునే బదులు, దక్షిణాది డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకోవాలని యష్ వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. రామాయణ రెండు భాగాలకు సంబంధించిన సౌత్ ఇండియన్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఆయన వద్దే ఉంచుకోనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ పాత్ర కోసం యష్ దాదాపు ₹100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
నీటి హక్కుల కోసం కేసీఆర్ సమరశంఖం: లక్ష మందితో ప్రాజెక్టుల బాట!
అయితే, కేవలం పారితోషికం కంటే డిస్ట్రిబ్యూషన్ హక్కులు దక్కించుకోవడమే ఎక్కువ లాభదాయకమని ఆయన భావిస్తున్నారట. సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధిస్తే, కలెక్షన్ల ద్వారా ఆయనకు లభించే లాభాలు సాధారణ రెమ్యూనరేషన్ కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ‘టాక్సిక్’ ప్రాజెక్ట్ పరంగా కొన్ని హెచ్చుతగ్గులు ఎదురైనప్పటికీ, రామాయణ సినిమాను వ్యాపారపరంగా కూడా భారీ స్థాయిలో క్యాష్ చేసుకునేందుకు యష్ ఈ సరికొత్త ప్లాన్ వేశారని సమాచారం.
