Homeసినిమాడ్రాగన్' మూవీ క్రేజ్: ఎన్టీఆర్ పక్కన ముగ్గురు భామల హంగామా!

డ్రాగన్’ మూవీ క్రేజ్: ఎన్టీఆర్ పక్కన ముగ్గురు భామల హంగామా!

క్రైమ్ మిర్రర్, సినిమా:- యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ మూవీ ‘డ్రాగన్’. ఈ సినిమా ప్రకటన వెలువడినప్పటి నుంచే టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా లెవెల్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.సినిమా వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్ ఉండబోతోందట. ఈ పాట కోసం చిత్ర యూనిట్ అత్యంత భారీ స్థాయిలో ఒక స్పెషల్ సెట్‌ను కూడా నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రత్యేక పాటకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ కూడా వినిపిస్తోంది. ఈ పాటలో రుక్మిణీ వసంత్‌తో పాటు మరో ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు కూడా ఎన్టీఆర్‌తో కలిసి స్టెప్పులేయనున్నట్లు సమాచారం.

వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లి సందడి!

ఎన్టీఆర్ ఎనర్జిటిక్ డ్యాన్స్‌కు తోడు, ముగ్గురు భామలు కలిసి స్టెప్పులేస్తే ఆ పాట థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్, ఎన్టీఆర్ మాస్ అప్పీరెన్స్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ విషయమై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఏపీ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్.. పలు రాష్ట్రాలకు ఏఐసీసీ నూతన బాధ్యులు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు