క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నాయకత్వంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని క్రీడా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత కొన్ని సీజన్లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించే ఆలోచనలో CSK యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.వరుసగా మూడు సీజన్లుగా సిఎస్కే ప్లేఆఫ్స్కు కూడా అర్హత సాధించలేకపోవడంతో, జట్టుకు కొత్త ఊపిరి పోసేందుకు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ సరైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటడంతో పాటు, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టును ముందుండి నడిపించి అనేక అద్భుత విజయాలు అందించిన అనుభవం సంజూ శాంసన్కు ఉంది. క్లిష్ట సమయంలో జట్టును నడిపించగల ఆయన నాయకత్వ పటిమ ప్రస్తుతం సిఎస్కేకి ఎంతో అవసరమని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.
సురేఖకు రాఖీ కట్టడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్!
నానక్రామ్గూడ హిట్ అండ్ రన్.. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడి లైసెన్స్ రద్దు
