Homeక్రైమ్నానక్‌రామ్‌గూడ హిట్‌ అండ్‌ రన్‌.. ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయి కుమారుడి లైసెన్స్‌ రద్దు

నానక్‌రామ్‌గూడ హిట్‌ అండ్‌ రన్‌.. ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయి కుమారుడి లైసెన్స్‌ రద్దు

నానక్‌రామ్‌గూడ ఓఆర్‌ఆర్‌ (ORR)పై జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ ఘటనలో అరెస్టైన ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయి కుమారుడు బి. శివ సందీప్‌ సాయి (23) డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సైబరాబాద్‌ పోలీసులు రద్దు చేశారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తి గాయపడ్డారు.

ప్రమాదం అనంతరం సందీప్‌ సాయి రక్త నమూనాలను పోలీసులు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీకి పంపించారు. ప్రాథమికంగా నిర్వహించిన డ్రగ్‌ పరీక్షలో నెగెటివ్‌ ఫలితం వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే పూర్తి స్థాయి ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక రావాల్సి ఉందని పేర్కొన్నారు.

కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, వాహనం నడిపిన సమయంలో డ్రైవర్‌ పరిస్థితి తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ తుది నివేదిక అందిన తర్వాత దర్యాప్తులో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

also read: నిజామాబాద్ ఆస్పత్రిలో మూడేళ్ల బాలుడు అదృశ్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు