క్రైమ్ మిర్రర్ : జోగులాంబ గద్వాల జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 44వ జాతీయ రహదారిపై టెన్త్ పఠాలం ఎదురుగా ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని ఓ కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను మౌనిక, సాయికుమార్‌గా, గాయపడిన వ్యక్తిని ముఖేశ్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ముఖేశ్‌ను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కారు అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందా, డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : శుభకార్యాల్లో వసూళ్లపై డీజీపీ సీవీ ఆనంద్ సీరియస్.. ప్రత్యేక డ్రైవ్‌కు ఆదేశం
