Homeక్రైమ్పది రోజుల తర్వాత టన్నెల్ నుంచి చైనా వ్యక్తి సజీవంగా బయటకు.. కొనసాగుతున్న సహాయక చర్యలు

పది రోజుల తర్వాత టన్నెల్ నుంచి చైనా వ్యక్తి సజీవంగా బయటకు.. కొనసాగుతున్న సహాయక చర్యలు

క్రైమ్ మిర్రర్ : నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదల కారణంగా టన్నెల్స్‌లో చిక్కుకున్న వారిని రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో త్రిశూలీ టన్నెల్‌లో చిక్కుకున్న ఓ చైనా పౌరుడిని పది రోజుల తర్వాత సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. అనంతరం అతడిని వైద్య చికిత్స కోసం కాఠ్మాండుకు తరలించినట్లు నేపాల్ ఆర్మీ వెల్లడించింది. వరదల ప్రభావానికి గురైన ప్రాంతాల్లోని జలవిద్యుత్ ప్రాజెక్టుల టన్నెల్స్‌లో చిక్కుకున్న కార్మికుల కోసం భారీ స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. వివిధ టన్నెల్స్‌లో దాదాపు 900 మంది కార్మికులు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆగస్టు 26న నేపాల్‌లో సంభవించిన తీవ్ర జలవిలయం భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ విపత్తులో సుమారు 1,300 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 5 వేల మంది వరకు ఆచూకీ లభించలేదని సమాచారం. బాధితుల కోసం భారత్, నేపాల్‌కు చెందిన సహాయక బృందాలు కలిసి గాలింపు, రక్షణ చర్యలు చేపడుతున్నాయి. శుక్రవారం కూడా త్రిశూలీ టన్నెల్ నుంచి ఇద్దరు నేపాలీ పౌరులను సజీవంగా బయటకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో టన్నెల్‌లలో చిక్కుకున్న మరికొందరిని కూడా కాపాడగలమనే ఆశలు పెరిగాయి.

ఇదిలా ఉండగా, నువాకోట్ పట్టణంలో పూర్తిగా ధ్వంసమైన ఓ ఇంటి శిథిలాల్లో చిక్కుకున్న 64 ఏళ్ల చండికా శ్రేష్ఠ అనే మహిళను కూడా నేపాల్ ఆర్మీ రక్షించింది. బేత్రావతిలోని ఆ ఇంటి శిథిలాల కింద ఆమె ఉన్నట్లు గుర్తించిన సైనికులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మట్టి, బురదతో పూర్తిగా కప్పబడిన ఆమెను వెంటనే వైద్య సహాయం కోసం తరలించారు. టన్నెల్స్, శిథిలాల్లో ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉన్నారా అనే కోణంలో రెస్క్యూ బృందాలు విస్తృతంగా గాలింపు కొనసాగిస్తున్నాయి.
also read : నగ్న పూజ పేరుతో విదేశీ మహిళను మోసం చేసి.. బ్లాక్‌మెయిల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు