Homeతెలంగాణకెన్యా దేశంలో టాటా కంపెనీకి షాక్‌...! త‌క్ష‌ణ‌మే దేశాన్ని వీడాల‌ని ఆ దేశం...

కెన్యా దేశంలో టాటా కంపెనీకి షాక్‌…! త‌క్ష‌ణ‌మే దేశాన్ని వీడాల‌ని ఆ దేశం…

ఢిల్లీ, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఆఫ్రికా దేశం కెన్యాలోని టాటా కెమికల్స్ మగాదీ లిమిటెడ్ కు షాక్ త‌గిలింది. ఆ కంపెనీపై ఆ దేశ అధ్యక్షుడు విలియమ్ రూటో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశాన్ని వీడాలని ఆదేశించారు. కొన్నేళ్లుగా తమ దేశంలో టాటా కంపెనీ కార్యకలాపాలు సాగిస్తున్నా స్థానిక ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని ఆరోపించారు.

Also Read:రోహిత్ శర్మ రిటైర్మెంట్ రూమర్లపై స్పష్టతనిచ్చిన బీసీసీఐ

టాటా కెమికల్స్ సంస్థ తమ దేశంలో రా సోడా యాష్ (సోడియం కార్బొనేట్) ఖనిజాన్ని కేవలం ఎగుమతి చేసుకునేందుకే పరిమితమైందని ఆరోపించారు. ఈ ఖనిజానికి సంబంధించి ఎలాంటి ఇతరత్రా పరిశ్రమలను స్థానికంగా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. కజియాడో కౌంటీలో టాటా సంస్థకు దీర్ఘకాలిక మైనింగ్ హక్కులు ఉన్నప్పటికీ స్థానికంగా మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టిపెట్టట్లేదని ఆరోపించారు. గ్లాజు, ఇతర కెమికల్ తయారీ ప్లాంట్లు ఏవీ ఏర్పాటు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా సమగ్ర ఆర్థిక అభివృద్ధి జరగలేదని చెప్పారు. టాటా సంస్థ స్థానంలో మరో రెండు సంస్థలను రప్పించి స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు.

Also Read:బీసీ బిడ్డ కాబట్టే తొలగించారు: ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు