Homeక్రైమ్వణికిస్తున్న నకిలీ హిజ్రాలు!

వణికిస్తున్న నకిలీ హిజ్రాలు!

-బెంబేలెత్తిపోతున్న భాగ్యనగరం ప్రజలు
-శుభకార్యాల నాడు బలవంతపు వసూళ్లు
-ఇవ్వకపోతే భౌతిక దాడులు
-కట్టడి చేయాలని పోలీసులకు విజ్ఞప్తి

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:-
సాధారణంగా హిజ్రాలు అంటేనే బలవంతపు వసూళ్లు, ఒక రకమైన అరాచకాలు అన్న అపవాదు ఉంది. మరి ఆ హిజ్రాల్లో నకిలీలు ప్రవేశిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నకిలీ హిజ్రాలు ఇప్పుడు రాజ్యమేలుతున్నారు. వారి అరాచకాలతో పాటు బలవంతపు వసూళ్లు రోజుకు హద్దు దాటుతున్నాయి. ఇంట్లో శుభకార్యం, వివాహం, గృహప్రవేశం, వ్యాపార ప్రారంభోత్సవం ఉందంటే చాలు.. వేలాది రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వీరంగం సృష్టిస్తున్నారు. ఇవ్వని పక్షంలో బూతులు తిడుతూ శాపనార్ధాలు పెడుతున్నారు. దీంతో శుభకార్యం చేయాలంటే భాగ్యనగరం ప్రజలు ఇప్పుడు బెంబేలెత్తిపోతున్నారు. వేడుకల్లో సంతోషంగా ఉండాల్సిన కుటుంబాలు వీరి బెదిరింపులు, దోపిడీకి భయపడిపోతున్నారు.

ఒక మాఫియాగా..
ఇటీవల నగరంలో క్రాస్ డ్రెస్సర్లు.. మగవారు సైతం హిజ్రాల వేషధారణలో వచ్చి రోడ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, షాపుల వద్ద వ్యాపారులను, దారిన పోయే వారిని వేధిస్తున్నారు. వేడుకల సమయంలో లక్షల్లో డిమాండ్ చేయడం.. ఇవ్వకపోతే దాడులకు దిగడం వంటి ఘటనలు పెరిగిపోవడంతో హైదరాబాద్ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నకిలీ హిజ్రాలు మాఫియా ముఠాలుగా ఏర్పడి ప్రైవేటు ప్రాంతాలను విభజించుకుని మరి ఈ దందా నడుపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే వీరి కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారి ఆగడాలు శృతిమిస్తున్నాయి. నకిలీ హిజ్రాల గ్యాంగులు ముఠాలుగా ఏర్పడి ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి.

పోలీసుల కఠిన చర్యలు..
అయితే నకిలీ హిజ్రాలపై వరుస ఫిర్యాదులతో నగర పోలీసు యంత్రాంగం చర్యలు చేపడుతోంది. సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు కమ్యూనిటీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి. శుభకార్యాల వద్ద బలవంతపు వసూళ్లు, వేధింపులకు దిగితే కఠిన చర్యలు తప్పవని.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని పౌరులను భయాందోళనకు గురి చేసే ఎవరైనా జైలుకు పంపుతామని హెచ్చరిస్తున్నారు. అయితే కేవలం హెచ్చరికలకు పరిమితం కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. వారి ఆగడాలను నియంత్రించాలని భాగ్యనగరవాసులు కోరుతున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు