Homeక్రైమ్నగ్న పూజ పేరుతో విదేశీ మహిళను మోసం చేసి.. బ్లాక్‌మెయిల్

నగ్న పూజ పేరుతో విదేశీ మహిళను మోసం చేసి.. బ్లాక్‌మెయిల్

క్రైమ్ మిర్రర్ : విదేశీ మహిళను నమ్మించి వీడియో కాల్‌ ద్వారా నగ్నంగా పూజ చేయించి, ఆ దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించి డబ్బుల కోసం బెదిరించిన ఘటన చెన్నైలో వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కెనడాకు చెందిన 37 ఏళ్ల మహిళ ఇటీవల తమిళనాడులో పర్యటించేందుకు వచ్చింది. చెన్నైలోని బెసెంట్ నగర్ బీచ్ వద్ద ఆమెకు చిలుక జోస్యం చెప్పే ఇసక్కిముత్తు అనే వ్యక్తి పరిచయమయ్యాడు.

జాతకం చెబుతున్న సమయంలో ఆమెను నమ్మించేందుకు నిందితుడు పలు విషయాలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే ప్రత్యేక పూజ చేయాలని, ఆ పూజను నగ్నంగా నిర్వహించాలని ఆమెను నమ్మించినట్లు పేర్కొన్నారు. ప్రత్యక్షంగా కాకుండా వీడియో కాల్‌లోనూ పూజ చేయవచ్చని చెప్పడంతో మహిళ అతడి మాటలు నమ్మింది. వీడియో కాల్‌ ద్వారా నిర్వహించిన పూజలో మహిళ పాల్గొనగా, అదే సమయంలో ఇసక్కిముత్తు ఆ దృశ్యాలను తన మొబైల్‌లో రికార్డు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పూజ నిర్వహించినందుకు ఆమె నుంచి రూ.20 వేల వరకు తీసుకున్నట్లు తెలిపారు.

కొంతకాలం తర్వాత నిందితుడు మహిళకు ఫోన్ చేసి తన వద్ద ఉన్న వీడియోను చూపించాడు. మరింత డబ్బు ఇవ్వాలని, లేకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు బుధవారం మాంబలం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇసక్కిముత్తును అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
also read : ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు