Homeతెలంగాణశుభకార్యాల్లో వసూళ్లపై డీజీపీ సీవీ ఆనంద్ సీరియస్.. ప్రత్యేక డ్రైవ్‌కు ఆదేశం

శుభకార్యాల్లో వసూళ్లపై డీజీపీ సీవీ ఆనంద్ సీరియస్.. ప్రత్యేక డ్రైవ్‌కు ఆదేశం

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:-తెలంగాణలో శుభకార్యాలు, వేడుకల సమయంలో కొందరు హిజ్రాలు డబ్బుల కోసం ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదులపై రాష్ట్ర పోలీసు శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు డీజీపీ సీవీ ఆనంద్ స్పందిస్తూ, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను అరికట్టేందుకు తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.ఇటీవల కాలంలో ఇలాంటి ఫిర్యాదులు భారీగా వస్తున్నాయని, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. తాను గతంలో హైదరాబాద్ సీపీగా పనిచేస్తున్న సమయంలో ఇలాంటి అక్రమ వసూళ్లను అరికట్టడానికి ప్రత్యేకంగా డ్రైవ్‌లు నిర్వహించినట్లు గుర్తుచేశారు. అదేవిధంగా, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కమిషనర్లు, ఎస్పీలు కూడా ఇలాంటి ఘటనలపై ప్రత్యేక దృష్టి సారించాలని, తక్షణమే మరోసారి ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని సీపీలకు ఆయన సూచించారు.

డ్రాగన్’ మూవీ క్రేజ్: ఎన్టీఆర్ పక్కన ముగ్గురు భామల హంగామా!

మరోవైపు, ట్రాఫిక్ అసిస్టెంట్లుగా సేవలందిస్తున్న ట్రాన్స్‌జెండర్లు ఎలాంటి ఫిర్యాదులకు తావులేకుండా అత్యంత బాధ్యతాయుతంగా, నిబద్ధతతో పనిచేస్తున్నారని డీజీపీ కొనియాడారు. అయితే, ఎవరైనా కావాలనే బలవంతపు వసూళ్లకు పాల్పడితే మాత్రం చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కొత్త రూల్స్: లెక్కలు చూపకపోతే మూడేళ్ల జైలు, పదవి రద్దు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు