Homeఆంధ్ర ప్రదేశ్వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లి సందడి!

వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లి సందడి!

క్రైమ్ మిర్రర్, ఏపీ:- ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహం నిశ్చయమైనట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, కాబోయే దంపతులకు అందరి ఆశీస్సులు కావాలని ఆమె కోరారు.అందిన వివరాల ప్రకారం, సోమలా సుబ్బారెడ్డి, పద్మారెడ్డి దంపతుల కుమారుడైన డాక్టర్ రఘురామ్ రెడ్డితో వైఎస్ అంజలి రెడ్డి వివాహం నిశ్చయమైంది. వీరు ప్రస్తుతం అమెరికాలో స్థిరపడినప్పటికీ, వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కావడం విశేషం. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వైఎస్ షర్మిల కుటుంబంలో ఈ వివాహం ద్వారా కొత్త బంధం కుదురుతుండటంతో రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే వివాహ తేదీ వేడుకకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కొత్త రూల్స్: లెక్కలు చూపకపోతే మూడేళ్ల జైలు, పదవి రద్దు!

సెన్సార్ బోర్డుపై ఆర్. నారాయణమూర్తి తీవ్ర ఆగ్రహం.. మంచి సినిమాలను ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు