Homeసినిమాసెన్సార్ బోర్డుపై ఆర్. నారాయణమూర్తి తీవ్ర ఆగ్రహం.. మంచి సినిమాలను ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి!

సెన్సార్ బోర్డుపై ఆర్. నారాయణమూర్తి తీవ్ర ఆగ్రహం.. మంచి సినిమాలను ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి!

క్రైమ్ మిర్రర్, సినిమా:- పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి సెన్సార్ బోర్డు వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా టీజర్ విడుదల వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, సెన్సార్ బోర్డు ప్రవర్తిస్తున్న తీరును తీవ్రంగా తప్పుపట్టారు.
కొన్ని సినిమాల్లో తీవ్రమైన బూతులు, అసభ్యకర దృశ్యాలు ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా క్లియరెన్స్ ఇస్తున్నారని, అదే సమయంలో మంచి సందేశాత్మక చిత్రాలను మాత్రం అనవసరంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘కామ్రేడ్ కళ్యాణ్’ అనే చిత్ర టైటిల్‌లో ‘కామ్రేడ్’ అనే పదం ఉండటంపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయడం ఏమాత్రం సరికాదని స్పష్టం చేశారు.తెలుగు సినీ పరిశ్రమ ఎంతోమంది కార్మికులకు, కళాకారులకు జీవితాన్ని, ఉపాధిని అందిస్తోందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అలాంటి పరిశ్రమను, నమ్ముకున్న నిర్మాతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం తగదని సెన్సార్ బోర్డు సభ్యులకు నారాయణమూర్తి సూచించారు.

ఏపీ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్.. పలు రాష్ట్రాలకు ఏఐసీసీ నూతన బాధ్యులు!

CSK కెప్టెన్‌గా సంజూ శాంసన్?.. రుతురాజ్‌పై వేటుకు చెన్నై సిద్ధం!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు