క్రైమ్ మిర్రర్ : ఫోక్ సాంగ్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ మధ్య కొనసాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారంటూ గతంలో మాధురి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఫిర్యాదు చేసినప్పటికీ తనకు న్యాయం జరగలేదనే మనస్తాపంతో మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఇంట్లో ఆమెను కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే కాపాడినట్లు తెలుస్తోంది. అనంతరం ఆమెకు వైద్య సహాయం అందించినట్లు సమాచారం.
ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని మాధురి ఆరోపించారు. పెళ్లి పేరుతో తనను మోసం చేశారని ఆమె మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో నార్సింగి పోలీసులు ఈ వ్యవహారంలో ఈశ్వర్ సాయిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మాధురి ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసుల నుంచి అధికారికంగా పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మాధురి చేసిన ఆరోపణలు, గతంలో నమోదైన ఫిర్యాదు, ప్రస్తుతం చోటుచేసుకున్న పరిణామాలపై దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
also read : కుప్పకూలిన హాస్టల్ భవనం.. శిథిలాల కింద విద్యార్థులు?
