క్రైమ్ మిర్రర్ : కేరళలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివాహ వేడుకకు హాజరై ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. త్రిస్సూర్ జిల్లాలోని గురువాయూర్–కున్నంకుళం మార్గంలో అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు బైక్పై ప్రయాణిస్తుండగా.. ఫోన్ మాట్లాడేందుకు మునీర్ రహదారి పక్కన వాహనాన్ని నిలిపినట్లు సమాచారం.
అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతులను మునీర్ (35), ఆయన భార్య సఫ్నా (25), మూడేళ్ల కుమారుడు యామిల్ ఐబక్గా పోలీసులు గుర్తించారు. వివాహ వేడుకలో పాల్గొని ఆనందంగా ఇంటికి తిరిగి వస్తున్న కుటుంబం.. ఊహించని ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో వారి బంధువులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు.
also read : పెళ్లి వేడుకలో భారీ అగ్నిప్రమాదం.. 22 మంది మృతి
