Homeక్రైమ్వంతెనపై అందరూ చూస్తుండగానే.. చీనాబ్ నదిలోకి దూకిన యువతి

వంతెనపై అందరూ చూస్తుండగానే.. చీనాబ్ నదిలోకి దూకిన యువతి

క్రైమ్ మిర్రర్ : జమ్ముకశ్మీర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. దోడా జిల్లాలోని ప్రేమ్‌నగర్‌ వంతెన వద్ద ఓ యువతి చీనాబ్‌ నదిలోకి దూకినట్లు సమాచారం. ఘటనకు ముందు ఆమె తన జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు అక్కడున్న వారికి చెప్పినట్లు తెలుస్తోంది. స్థానిక సమాచారం ప్రకారం.. పాయల్‌ దేవి ఆదివారం ఓ జాతరకు వెళ్లింది. అనంతరం గ్రామానికి చెందిన ఓ పరిచయస్తుడితో కలిసి బైక్‌పై ఇంటికి తిరుగు ప్రయాణమైంది. మార్గమధ్యంలో ఆమె దుప్పట్టా బైక్‌ చక్రంలో చిక్కుకోవడంతో వాహనాన్ని ఆపారు. ఆ సమయంలో పాయల్‌ దేవి వంతెన సమీపానికి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఆమె పరిస్థితిని గమనించిన అక్కడున్న కొందరు వ్యక్తులు వెనక్కి రావాలని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఆమెతో ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ఫోన్‌లో తండ్రితో మాట్లాడిన పాయల్‌.. తన నిర్ణయాన్ని మార్చుకోనని చెప్పినట్లు సమాచారం. అనంతరం ఆమె నదిలోకి దూకడంతో అక్కడున్నవారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. నదిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే ఇప్పటివరకు యువతి ఆచూకీ లభించలేదని అధికారులు తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కొందరు తమ మొబైల్‌ ఫోన్లలో చిత్రీకరించగా, అది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
also read : ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు