తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ సరళి వేగంగా మారుతోంది. గత కొన్ని రోజులుగా భిన్నమైన పరిస్థితులు నెలకొనగా, రాబోయే 24 గంటల్లో రెండు రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో రేపు ఉదయం 8:30 గంటల వరకు మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సూచనలు ఉన్నందున రైతులు, ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో సైతం అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. వాతావరణంలో వచ్చిన ఈ మార్పుల వల్ల కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించనుంది. వర్ష సూచన ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
రామాయణ’తో యష్ మాస్టర్ ప్లాన్: రెమ్యూనరేషన్ వదులుకుని బిగ్ డీల్!
నీటి హక్కుల కోసం కేసీఆర్ సమరశంఖం: లక్ష మందితో ప్రాజెక్టుల బాట!
