క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- బీఆర్ఎస్ఎల్పీ (BRSLP) సమావేశంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అత్యంత కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించారు. తెలంగాణ ప్రజల సాగు, తాగునీటి హక్కుల పరిరక్షణ కోసం త్వరలోనే భారీ స్థాయిలో పాదయాత్ర చేపట్టబోతున్నట్లు స్పష్టం చేశారు.ఈ ఆందోళన కార్యక్రమంలో భాగంగా తానే స్వయంగా కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుల వద్దకు వెళ్తానని కేసీఆర్ వెల్లడించారు. సుమారు లక్ష మంది ప్రజలు, రైతులు మరియు పార్టీ శ్రేణులతో కలిసి ఈ రెండు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను సందర్శించనున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో నీటి నిర్వహణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని, ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని ఆయన ఆరోపించారు. రైతుల పంటలకు సాగునీరు అందించడంలో నిమ్మకు నీరెత్తెనట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును క్షేత్రస్థాయిలోనే గట్టిగా నిలదీస్తామని తేల్చి చెప్పారు. నీటి కోసం పోరాటానికి కేసీఆర్ సిద్ధమవ్వడంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ పాదయాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే ఈ యాత్రకు సంబంధించిన పూర్తి కార్యాచరణ, తేదీలను బీఆర్ఎస్ ప్రకటించనుంది.
మహిళ కడుపులో 14 పెన్నులు.. స్కానింగ్‌లో షాకింగ్ విషయం!
పెళ్లి వేడుకలో భారీ అగ్నిప్రమాదం.. 22 మంది మృతి
