Homeఆంధ్ర ప్రదేశ్ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉద్యోగుల‌కు వ‌ర్కు ఫ్రం హోం...!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉద్యోగుల‌కు వ‌ర్కు ఫ్రం హోం…!

తిరుపతి, క్రైమ్‌మిర్ర‌ర్‌: పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావం మనదేశంలోనూ కనిపిస్తోంది. అందుకే ముందస్తు సన్నాహంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పొదుపు సూచనలు చేశారు. ఇందన వినియోగాన్ని తగ్గించాలని, సొంత వాహనాలకు బదులు కార్ పూలింగ్, ప్రభుత్వ రవాణా వ్యవస్థలను ఉపయోగించుకోవాలని.. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని.. ఇలా పలు రకాల సూచనలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ప్రధాని సూచనలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ప్రకటించిన ఎనిమిది అంశాలను పాటించాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఒకటి రెండు రోజుల్లోదీనిపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఒక కార్యాచరణ ప్రకటించనున్నట్లు చెప్పారు. వర్క్ ఫ్రం హోం విధానంపై మాట్లాడారు సీఎం చంద్రబాబు.కరోనా వచ్చిన తరువాత వర్క్ ఫ్రం హోం అనేది వెలుగులోకి వచ్చింది. కంపెనీలు ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు.. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు గాను అప్పట్లో వర్క్ ఫ్రం హోం అమలు చేశారు. అయితే ఇప్పటికీ వర్క్ ఫ్రం హోం అమలవుతూనే ఉంది. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వర్క్ ఫ్రం హోం అంటూ ఒక సర్వే చేపట్టింది. ఇంట్లో ఉండి ఉపాధి పొందేందుకు వీలుగా ఈ సర్వే సాగింది. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్క్ ఫ్రం హోం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని చూసింది.

అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 8 అంశాల్లో పొదుపు పాటించాలని పిలుపునివ్వడంతో.. వర్క్ ఫ్రం హోం ను పక్కాగా అమలు చేయాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. గజగదానిపై కీలక వ్యాఖ్యలు చేశారు.వర్క్ ఫ్రం హోం అనేది రియాలిటీ. ఇంటి నుంచి ప్రపంచం మొత్తం పనిచేసే పరిస్థితి ఉంటుంది. దీనికి ఎంతగానో ప్రోత్సాహం అందిస్తామని సీఎం చంద్రబాబు చెప్పడం విశేషం. ప్రభుత్వంలోనూ ఈ తరహా విధానం తెస్తామని.. తద్వారా దుబారా ఖర్చును తగ్గిస్తామన్నారు.

ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా తమ కాన్వాయ్ వాహన శ్రేణిని తగ్గించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా సెక్యూరిటీ తగ్గించుకునే పనిలో ఉన్నట్లు సీఎం చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. ప్రపంచ పర్యాటక ప్రాంతాలకు వెళ్లే కంటే మన దేశంతో పాటు సొంత రాష్ట్రాల్లో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. విదేశీ పర్యటనలకు వెళ్ళొద్దని ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా సూచించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే విషయాన్ని చెబుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.

త్వరలో రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా పొదుపు మంత్రం పై కీలక సూచనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.పెరుగుతున్న ప్రపంచ ఇంధన ధరల నేపథ్యంలో కేంద్రం పొదుపు, మితమైన వినియోగం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అయినప్పటికీ ఎలక్ట్రానిక్స్ దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు విధించే ప్రణాళికలు లేవని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. తయారీ, ఎగుమతులు, డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణతో సహా ఆర్థిక వ్యవస్థ

లోని ఉత్పాదక రంగాలలో ఎలక్ట్రానిక్స్ దిగుమతులు కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నాయని అధికారులు తెలిపారు. పెరుగుతున్న ప్రపంచ మెమరీ చిప్ ధరలు సమీప భవిష్యత్తులో ఎలక్ట్రానిక్స్ దిగుమతుల విలువను పెంచవచ్చని, అదే సమయంలో భారతదేశంలో కొనసాగుతున్న డేటా సెంటర్ల నిర్మాణం, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనకు ఏఐ (AI) సర్వర్లు అత్యవసరంగా అవసరమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎలక్ట్రానిక్స్ దిగుమతులు 116.17 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.కాగా సాధ్యమైన చోటల్లా ఉద్యోగులను రిమోట్‌గా పని చేయడానికి అనుమతించాలని ఈ మేరకు ఐటీ, ఐటీ ఆధారిత సేవల కంపెనీలకు సలహా ఇవ్వాలని

కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను నూతన సమాచార సాంకేతిక ఉద్యోగుల సెనేట్ (నైట్స్) కోరింది. ఇంధనాన్ని ఆదా చేయాలని, అనవసర ప్రయాణాలను తగ్గించాలని ప్రధాని ఇచ్చిన పిలుపునకు ఈ చర్య అనుగుణంగా ఉంటుందని ఆ సంఘం పేర్కొంది. ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు పొదుపు..ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ బహిరంగ సభలో మాట్లాడుతూ పొదుపు చర్యల గురించి ప్రస్తావించారు.

దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించడానికి, పెరుగుతున్న ప్రపంచ చమురు ధరల నుండి ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి, దిగుమతి చేసుకున్న పెట్రోలియం ఉత్పత్తులను తెలివిగా ఉపయోగించాలని పౌరులను కోరారు ప్రధాని మోదీ. ఇందులో భాగంగా వర్క్-ఫ్రమ్-హోమ్ ఏర్పాట్లు, వర్చువల్ సమావేశాలు, ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌లతో సహా కోవిడ్ రోజుల నాటి అనేక పద్ధతులను పునరుద్ధరించాలని ప్రధాని పిలుపునిచ్చారు. అలాగే ప్రజా రవాణా (పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్), కార్-పూలింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, రైలు సరుకు రవాణ వినియోగాన్ని ప్రోత్సహించారు. “Work From Home” అనేది ఇక ఫ్యూచర్ కాదు… అది ఇప్పుడు రియాలిటీ. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం కోసం పని చేసే రోజులు ఇంకా పెరుగుతాయి. డబ్బు సంపాదించే అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు