HomeతెలంగాణTG ICET 2026: ప్రశాంతంగా ముగిసిన టీజీ ఐసెట్-2026.. 91 శాతం అభ్యర్థుల హాజరు!

TG ICET 2026: ప్రశాంతంగా ముగిసిన టీజీ ఐసెట్-2026.. 91 శాతం అభ్యర్థుల హాజరు!

క్రైమ్ మిర్రర్, నల్లగొండ బ్యూరో: తెలంగాణ ఐసెట్ 2026 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా 69 కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుంగా జరిగాయి. మూడు సెషన్లలో జరిగిన ఈ పరీక్షలలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి, పారదర్శకంగా నిర్వహించారు.

91 శాతం అభ్యర్థుల హాజరు

ఈ ఏడాది టీజీ ఐసెట్–2026కు మొత్తం 56,206 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, అందులో 51,146 మంది పరీక్షకు హాజరయ్యారు. 5,060 మంది గైర్హాజరయ్యారు. మొత్తం హాజరు శాతం 91గా నమోదైంది. చివరి రోజు ఉదయం జరిగిన సెషన్‌కు 18,711 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 17,056 మంది పరీక్ష రాశారు. ఈ సెషన్‌లో హాజరు శాతం 91.17గా నమోదైంది. సుమారు 1,652 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేదు.అంతకు ముందు మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఉపకులపతి, టీజీ ఐసెట్–2026 చైర్మన్ ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అధికారుల సమక్షంలో ప్రశ్నాపత్రం సెట్ కోడ్ Cని విడుదల చేశారు.

నల్గొండ టీజీ ఐసెట్ కార్యాలయం నుంచి నిరంతర పర్యవేక్షణ

పరీక్షా ప్రక్రియ మొత్తం నల్గొండలోని టీజీ ఐసెట్ కార్యాలయం నుంచి నిరంతరం పర్యవేక్షించారు. కన్వీనర్, కో-కన్వీనర్లు ప్రతి పరీక్షా కేంద్రం పనితీరును రియల్ టైమ్‌లో పరిశీలిస్తూ సమన్వయం చేశారు. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. అధికారులు నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయడంతో పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా పూర్తయ్యాయి.

అందరి సాకారంతో పరీక్షలు విజయవంతం- అల్వాల రవి

టీజీ ఐసెట్-2026 పరీక్షలు ప్రశాంతంగా ముగియడం పట్ల కన్వీనర్ ఆచార్య అల్వాల రవి సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధికారులు, పరీక్షా సిబ్బంది, పరిశీలకులు, అభ్యర్థుల సహకారంతో పరీక్షను విజయవంతంగా నిర్వహించగలిగామని చెప్పారు. ప్రతి కేంద్రంలో సమన్వయం బాగా ఉండటంతో పరీక్షలు ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగాయన్నారు. ఈ పరీక్షల నిర్వాహణ కోసం సాంకేతిక సహకారం అందించిన టీసీఎస్ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పరీక్షల నిర్వహణలో మీడియా ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించారని అభినందించారు. విద్యుత్ శాఖ,టీజీఎస్‌ఆర్టీసీ సిబ్బంది కూడా పరీక్షల సమయంలో నిరంతర సేవలు అందించారని తెలిపారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు రవాణా సదుపాయాలు కల్పించడంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషించిందన్నారు.

మొత్తంగా టీజీ ఐసెట్–2026 పరీక్షలు ఎటువంటి అంతరాయం లేకుండా విజయవంతంగా ముగియడంతో అధికారులు, విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు