-
కాంగ్రెస్ అమ్ముడు పోయింది అనే కామెంట్స్ పై షోకాజ్ నోటీసులు
-
విచారణ కమిటీ ఎదుటకు మాజీమంత్రి
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి షబ్బీర్ అలీ తీరుపై హై కమాండ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనపై వేటు వేసేందుకు రంగం సిద్ధం అయినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోతోంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు లీక్ అయిన సంగతి తెలిసిందే.
దీనిపై కాంగ్రెస్ అధిష్టానం షబ్బీర్ అలీ కి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే దీనిపై వివరణ ఇచ్చేందుకు సిద్ధం అని షబ్బీర్ అలీ ప్రకటించారు. 2023 ఎన్నికల్లో పోటీ చేసిన షబ్బీర్ అలీ ఓడిపోయారు.
Also Read: తెలంగాణ సిఎస్ గా జయేష్ రంజన్…! – Crime Mirror
దీంతో ఆయనకు సలహాదారు పదవి దక్కింది. కానీ కామారెడ్డి నియోజకవర్గం వేదికగా షబ్బీర్ అలీ చేస్తున్న రాజకీయం కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లో పెడుతోంది. అందుకే ఆయనపై వేటుపడడం ఖాయమని తెలుస్తోంది.
-
అత్యంత సీనియర్ నేత..
కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేత షబ్బీర్ అలీ. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. 1970 నుంచి యువజన కాంగ్రెస్ లో క్రియాశీలకం అయ్యారు. 1989లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. చిన్న వయసులోనే చెన్నారెడ్డి మంత్రివర్గంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరించారు.
1994, 1999 ఎన్నికల్లో ఓడిపోయారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు షబ్బీర్ అలీ. రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా వ్యవహరించారు. 2009లో కామారెడ్డి నియోజకవర్గ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2013లో ఎమ్మెల్సీ అయ్యారు. 2014 ఎన్నికల్లో సైతం కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
Also Read: కుప్పకూలిన మమత బెనర్జీ సామ్రాజ్యం…! – Crime Mirror
2018లో సైతం ఓటమి తప్పలేదు. 2023లో మాత్రం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అక్కడ కూడా ఓటమి తప్పలేదు. తన రాజకీయ జీవితంలో కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచారు. ఏకంగా ఆరుసార్లు ఓడిపోయారు..
-
ఆ నేతకు పదవి ఇవ్వడంతో..
కామారెడ్డి నియోజకవర్గంలో చంద్రశేఖర్ రెడ్డి అనే నేతను కాంగ్రెస్ పార్టీలోకి తెప్పించింది షబ్బీర్ అలీ. అదే చంద్రశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఇటీవల రాష్ట్రస్థాయి పదవి ఇచ్చింది.. అయితే దానిని నిరసిస్తూ షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ డబ్బులకు అమ్ముడుపోతోంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
మరో ద్వితీయ శ్రేణి నాయకుడితో ఫోన్లో మాట్లాడిన ఆడియో సంభాషణ బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాంగ్రెస్ హై కమాండ్ దృష్టికి వెళ్లడంతో షబ్బీర్ అలీ కి నోటీసులు జారీ అయ్యాయి.
Also Read: ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగలం.. రూ.200 కోట్ల ఆస్తులు!! – Crime Mirror
షబ్బీర్ అలీ సీనియర్ నేతగా ఉన్నా ఆయన వల్ల పార్టీకి ఎటువంటి ప్రయోజనం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆయనపై వేటు వేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మైనారిటీ నేత కావడంతో ఈసారి హెచ్చరించి వదిలేస్తారు అన్న ప్రచారం కూడా జరుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Also Read: Tirumala Laddu Update: తిరుమల లడ్డూపై టీటీడీ కీలక నిర్ణయం..! – Crime Mirror