-
నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో 20 మంది విలీనం
-
ఇక టీఎంసీ కి మిగిలింది 8 మంది ఎంపీలే..
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: బెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్ లో అంతర్గత సంక్షోభం ఊహించని మలుపు తిరిగింది. మమతా బెనర్జీని విభేదిస్తూ బయటకు వచ్చిన పార్టీ ఎంపీలు కేవలం ఒక శిబిరంగా మారడమే కాదు.. ఒక ప్రాంతీయ పార్టీలో విలీన ప్రక్రియను పూర్తి చేశారు.
Also Read: మామూలోళ్లు కాదు.. ఏకంగా ఇంట్లోనే..
కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ నివాసంలో సుదీర్ఘంగా సమావేశమైన 20 మంది రెబల్ ఎంపీలు.. నేరుగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాసానికి చేరుకుని అధికారికంగా విలీన పత్రాన్ని అందజేశారు. కేవలం అనర్హత వేటుకు భయపడి అంతగా ప్రాచుర్యంలో లేని ప్రాంతీయ పార్టీలో విలీనం కావడం విశేషం.
-
న్యాయపరమైన చిక్కులు తప్పించుకునేందుకు.
మమతా బెనర్జీని విభేదించి.. తృణమూల్ కాంగ్రెస్ ను కాదని కొత్తగా గ్రూపుగా పెడితే స్పీకర్ నిర్ణయం పై న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. అందుకే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ లోని లూప్ హోల్ ను రెబల్స్ వాడుకున్నారు. నాలుగేళ్ల కిందట అంటే 2022లో.. పార్టీగా నమోదై.. ఈశాన్య రాష్ట్రాల్లో స్వల్ప ప్రాతినిధ్యం ఉన్న నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో తాము విలీనం అవుతున్నట్లు స్పీకర్ కు ఇచ్చిన లేఖలో ప్రకటించారు.
Also Read: అమరనాథ రెడ్డి మౌనం వెనుక కారణం ఏంటీ…?
మొత్తం 28 మంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు గాను.. 20 మంది ఎంపీలు ఈ విలీన లేఖ పై సంతకాలు చేయడంతో సాంకేతికంగా వీరిపై అలాంటి అనర్హత వేటు వేయడం సాధ్యం కాదు. తద్వారా వీరంతా ఎన్సిపిఐ సభ్యులుగా మారి కేంద్రంలోని బిజెపి నేతృత్వంలో ఎన్డీఏ కూటమికి అధికారికంగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
-
మరో ఇద్దరు ఎంపీలు సైతం..
అయితే ఈ తిరుగుబాటు ఎంపీల సంఖ్య 22 కు చేరినట్లు తెలుస్తోంది. కేవలం ఆరుగురు మాత్రమే మమతా వెంట నిలిచినట్లు సమాచారం. అయితే మమతా బెనర్జీకి అత్యంత షాకీర్ పరిణామం ఒకటే జరిగింది. ఇన్నాళ్లు లోక్సభలో టీఎంసీ పక్ష నాయకుడిగా, మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న సీనియర్ మోస్ట్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ తిరుగుబాటు శరీరంలో చేరిపోవడం సంచలనంగా మారింది.
Also Read: ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో సరికొత్త నిర్ణయం.. తొలి ప్రాధాన్యం వారికే!!
ఆయన సైతం ఎన్సిపిఐ లో విలీనం అవుతున్నట్లు కూడా ప్రకటించారు. అయితే ఈ ఊహించని రాజకీయ సునామీతో కోల్కత్తాలోని మమతా బెనర్జీ నివాసం పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. ఎప్పటికీ 64 మంది ఎమ్మెల్యేలు చేజారిపోయారు. ఇప్పుడు 20 మంది ఎంపీలు తిరుగుబాటు చేయడంతో బెంగాల్లో మమత పూర్తిగా పట్టు కోల్పోయే పరిస్థితి వచ్చింది.
Also Read: Tirumala Laddu Update: తిరుమల లడ్డూపై టీటీడీ కీలక నిర్ణయం..!