Homeఆంధ్ర ప్రదేశ్ఎర్ర బస్సు కాదు.. ఎయిర్ పోర్టు వచ్చింది... వైసీపీకి కౌంటర్ వేసిన లోకేష్!

ఎర్ర బస్సు కాదు.. ఎయిర్ పోర్టు వచ్చింది… వైసీపీకి కౌంటర్ వేసిన లోకేష్!

క్రైమ్ మిర్రర్, ఏపీ:- స్వాతంత్ర్యం కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప ప్రదేశం ఉత్తరాంధ్ర అని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కొనియాడారు. భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలపై, విమర్శకులపై పరోక్షంగా విరుచుకుపడ్డారు.’ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్ పోర్టు అవసరమా అని గతంలో కొంత మంది హేళన చేశారు. ఉత్తరాంధ్రను తక్కువగా చూశారు. ఇక్కడి ప్రజలను అవమానించారు.’ అని లోకేష్ మండిపడ్డారు. ‘కానీ ఇప్పుడు ఎర్రబస్సు రాని చోటుకు ఎయిర్ పోర్టు వచ్చింది, ఎయిర్ బస్ వచ్చింది, సాక్షాత్తూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు’ అని ఆయన సగర్వంగా పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా లోకేష్ స్పష్టం చేశారు. ఇదే వేదికగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ప్రతిపక్ష పార్టీ వైసిపి పై కౌంటర్లు వేశారు.

ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. 59కి చేరిన బాధితుల సంఖ్య

రంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలి…! హైకోర్టు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు