Homeక్రైమ్అద్దె ఇల్లు ఖాళీ చేయించేందుకు వెళ్లిన యజమానిపై కాల్పులు.. న్యాయవాది అరెస్ట్

అద్దె ఇల్లు ఖాళీ చేయించేందుకు వెళ్లిన యజమానిపై కాల్పులు.. న్యాయవాది అరెస్ట్

క్రైమ్ మిర్రర్ : కోర్టు ఆదేశాల మేరకు అద్దె ఇంటిని ఖాళీ చేయించేందుకు వెళ్లిన ఇంటి యజమానురాలిపై ఓ న్యాయవాది కాల్పులు జరిపిన ఘటన చండీగఢ్‌లో కలకలం రేపింది. ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడగా, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల వివరాల ప్రకారం.. చండీగఢ్‌లోని సెక్టార్ 42లో ఉన్న ఓ ఇంటిని ఖాళీ చేయించేందుకు శనివారం పోలీసులు, అధికారులు, ఇంటి యజమానురాలు మంజిందర్ కౌర్ అక్కడికి చేరుకున్నారు. అద్దెదారుడిగా ఉన్న న్యాయవాది జేపీఎస్ చాధాను కోర్టు ఉత్తర్వుల మేరకు ఇంటిని ఖాళీ చేయాలని కోరారు.

అయితే చాధా ఇంటి తలుపు తెరవకుండా లోపలే ఉన్నాడు. అనంతరం ఇంటి లోపల నుంచి లైసెన్స్ కలిగిన డబుల్ బ్యారెల్ గన్‌తో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఇంటి యజమానురాలు మంజిందర్ కౌర్ నోటికి బుల్లెట్ తగిలి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం పీజీఐఎంఈఆర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఘటన అనంతరం పోలీసులు నిందితుడు జేపీఎస్ చాధాను అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సంఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి కీలక ఆధారాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు. ఇంటి ఖాళీ వివాదం నేపథ్యంలో ఈ కాల్పులు జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి, దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
also read ; అమ్మకానికి ఆడ శిశువు.. రూ.5 లక్షలకు బేరం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు