Homeతెలంగాణఈశ్వర్ సాయి–మాధురి రాథోడ్ వివాదంలో ఊహించని పరిణామం

ఈశ్వర్ సాయి–మాధురి రాథోడ్ వివాదంలో ఊహించని పరిణామం

క్రైమ్ మిర్రర్ : తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన జానపద కళాకారులు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదం తాజాగా మరో మలుపు తిరిగింది. పెళ్లి పేరుతో తనను మోసం చేశారంటూ మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలోనూ విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె విడుదల చేసినట్లు చెబుతున్న ఆడియో సందేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుటుంబ పరిస్థితులు, ఎదురైన పరిణామాలపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఈ పరిణామాల మధ్య శరణ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు వెంటనే గుర్తించి ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారని, ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఇప్పటికే వ్యక్తిగత వివాదంగా ప్రారంభమైన ఈ వ్యవహారం అనూహ్య పరిణామాలకు దారితీయడంతో జానపద కళారంగంలోనూ, అభిమానుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
also read : కాన్పూర్ ఫార్మా వ్యాపారి హత్య కేసులో కొత్త ట్విస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు